భారత్‌లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు

5,734 కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,734 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ బారిన పడి 166 మంది మరణించినట్లు తెలిపింది. కాగా ఇప్పటి వరకు దీని నుండి 473 కోలుకోగా.. 5,095 మంది ప్రస్తుతం ఆసుత్రుల్లో చిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/