తమిళనాడులో కరోనా విజృంభణ

కరోనా భాధితుల్లో 31 మంది చిన్నారులు

corona virus
corona virus

చెన్నై: తమిళనాడు నిన్నటి వరకు 1,173 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో 31 మంది చిన్న పిల్లలు ఉండడం ఆందోళన కలిగిస్తోందని, వీరంతా పదేళ్లలోపు చిన్న పిల్లలని, ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ తలిపారు. కాగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా 12, 746 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 2,091 మంది రిపోర్టులు వచ్చాయి. ఇందులో 98 మందికి కరోనా పాజిటివ్‌ రాగా మిగిలిన వారికి నెగిటివ్‌ వచ్చింది ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్‌ బారిన పడి 11 మంది మృతి చెందారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/