మూడోసారి కరోనా బారినపడిన స్పీకర్ పోచారం..

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినప్పటికీ..రాజకీయ నేతలను మాత్రం కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు నేతలు రెండోసారి కరోనా బారినపడగా..తాజాగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు.

జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్న ఆయనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా లేదని డాక్టర్స్ తెలిపారు. కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం కోరారు. స్పీకర్‌కు కరోనా సోకడం ఇది మూడోసారి కావడం గమనార్హం.