ఖమ్మం ఆర్టీసీ ని చుట్టేస్తున్న కరోనా

రీజియన్ పరిధిలో 40 మంది డ్రైవర్లు , కండక్టర్లకు పాజిటివ్ నిర్ధారణ

Corona agitation among Khammam RTC staff
Corona agitation among Khammam RTC staff

Khamam : ఖమ్మం జిల్లా ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతూ ఉంది. ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. గడచిన వారం లో ఖమ్మం రీజియన్ పరిధిలో 38 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు కరోనా భారిన పడ్డారు. వీరికి ఈనెల 11వ తేదీ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందని అధికారులు తెలిపారు. పండుగ సెలవు ల రద్దీతో వీరు కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. కాగా ఖమ్మం డిపో పరిధిలో 21, కొత్తగూడెం 7, భద్రాచలం 4, మధిర 3, సత్తుపల్లిలో ముగ్గురు కరోనా భారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు కంగారు పడుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/