కరోనా వైరస్
ఆరోగ్యం- జాగ్రత్తలు

ఇది వైరస్‌లలో కెల్ల శక్తి వంతమైన కొత్త వైరస్. ఇది ఎవరికైనా రావచ్చు. ధనిక, బీద తేడా లేకుండా వయో భేదం లేకుండా వచ్చే వైరస్. ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు.
కాని తీవ్ర రూపంలో విజృంభించేసరికి ప్రజలందరిలో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఇది ఏడవ రకం కరోనా వైరస్.
ఇంతకు ముందే ఆరు రకాల కొరనా వైరస్‌లు జంతువ్ఞల్ని, మనుషుల్ని ఎఫెక్ట్ చేసినప్పటికీ మరణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ముందు జాగ్రత్తల వల్ల తగ్గిపోయిందనే చెప్పాలి.
ఈ కొరనా వైరస్ చైనాలోని యుహాన్‌లోని జంతువ్ఞల మాంసం దుకాణంలో (వెట్ మార్కెట్) నుండి వ్యాపించిందంటున్నారు.
2019లో నవంబర్‌లో గబ్బిలాలలో ఉన్న కరోనావైరస్ పాముల్లో ఉన్న కరోనా వైసర్‌తో కలవడం వల్ల 7వ రకం కరోనా వైరస్ ఉద్భవించింది.
ఇది మనుషుల నుండి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందడంతో దీన్ని నోవల్ కరోనా వైరస్‌గా నామకరణం చేయడం జరిగింది.
కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధినే కోవిడ్ – 19గా డబ్ల్యుహెచ్‌ఒ గుర్తించడమైంది.
ఇది 70 శాతం సార్స్ కరోనా వైరస్‌ని పోలి 30 శాతం సరికొత్త వైరస్‌గా ఉద్భవించింది. ఈ వైరస్ గుండ్రంగా, తేలికగా ఉండే కణం.
ఇది జంతువ్ఞల్లో, పక్షుల్లో శ్వాసకోశ వ్యాధిని, ఆవ్ఞలు, పందుల్లో జీర్ణకోశవ్యాధిని (విరేచనాలు) కలిగించే వైరస్. ఇది కొరనా విరిడే తరగతికి (ఆర్ప్రోకొరోనావిరినే). నిడోవిరలెస్ ఆర్దర్‌కి చెందినది.
ఇది ఇతర ఆర్‌ఎన్‌ఎ వైరస్‌ల కన్నా దీని జీనోమ్ సైజ్ (26-32 కిలోబేస్) ఎక్కువగా ఉండడం, ఇది క్లచ్ ఆకారంలో ఉండి దాని ఉపరితంలో స్పైక్స్ కలిగి ఉండడం విశేషం.
కరోనా వైరస్‌ని మొదట 1930లో కోళ్లలో ఇన్ఫెక్షన్ కలిగించడంతో గుర్తించారు. దీన్ని ఇన్ఫెక్షువస్ (బాంకైటిస్ వైరస్) (ఐబివి) గా 1931లో ఆర్ధ్రర్ షాక్, ఎమ్‌సి హాన్ వ్యవహరించారు.
దీనివల్ల 40-90 శాతం కోళ్లు (టర్కీ) చనిపోవడం జరిగింది. 1937లో ఫ్రెడ్ బ్యుడెట్, చార్లెస్ హడ్సన్ దీనిపై పరిశోధనలు చేసి వ్యాధిగ్రస్తమైన వాటిని ఐసోలేట్ చేసి వ్యాధిని రూపుమాపడం జరిగింది.
1940లో మరో 2 కరోనా వైరస్‌ల్ని గుర్తించడం జరిగింది.
అవి మౌస్ హెపటైటిస్ వైరస్ ( ఎంహెచ్‌వి) మరియు ట్రాన్స్‌మిసిబుల్ గ్యాస్ట్రో ఎంటిరైటిస్ వైరస్ (టిజిఒఆర్)ఇవి జంతువ్ఞల కనిపించే వైరస్‌లు వీటినే బొవైన్ కరోనా వైరస్‌లుగా గుర్తించడమైంది.
1960లో హ్యుమన్ కొత్తగా వైరస్‌ని స్కాటిష్ వైరాలజిస్ట్ అయినా జూన్ ఆల్మెడా లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో గుర్తించి దానికిv కరోనావైరస్ 229 ఇ గా పేరు పెట్టడమైంది.
దీనికి కొరనా అనేది లాటిన్ పడం నుండి పేరు పెట్టడమైనది. దీని అర్ధం క్రౌన్. కిరీటం. సూర్యుని వలయం లాగా ఉండడం.
దీని రియన్స్ (ఇన్ఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైరస్) ప్రత్యేకంగా ఉండడం వల్ల ఈ పేరు పెట్టడమైంది.
అలాగే 1968లో గ్రీక్ పదం గార్లండ్ (పూలదండ). పూలదండలో కూర్చినట్లు దీని నిర్మాణం ఉండడంతో దీనికా పేరు పెట్టడమైనది.
- డాక్టర్. కె.ఉమాదేవి,
తిరుపతి
తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/