కార్న్‌ టేస్ట్‌

కార్న్‌ టేస్ట్‌

మొక్కజొన్న ఫ్రైడ్‌రైస్‌

కావలసినవి:
బియ్యం-కప్పు, మిరియాలపొడి-రెండు టేబుల్‌స్పూన్లు మొక్కజొన్నగింజలు-అరకప్పు, నెయ్యి-రెండు టేబుల్‌స్పూన్లు, అజినమోటో- చిటికెడు, ఉప్పు-సరిపడా, సోయాసాస్‌-అరటేబుల్‌స్పూన్‌ జీలకర్ర-ఒక టేబుల్‌స్పూన్‌

తయారుచేసే విధానం
అన్నం వండి పక్కన ఉంచాలి. బాణలిలో నెయ్యి వేసి కరిగిన తరువాత జీలకర్ర వేయాలి. తరువాత మొక్కజొన్న గింజలు, మిరియాలపొడి, అజినమోటో, ఉప్పు, సోయాసాస్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత వండిన అన్నం వేసి బాగా కలపాలి. డిన్నర్‌కి ఇది ఎంతో రుచిగా స్పైసీగా ఉంటుంది.

మొక్కజొన్న చాట్‌

కావలసినవి:
మొక్కజొన్న గింజలు-రెండొందల గ్రాములు, పచ్చిమిర్చి-నాలుగు ఉల్లిపాయలు-నాలుగు, జీలకర్ర-చెంచా, నూనె-కొద్దిగా, గరంమసాలా-చెంచా, ఉప్పు, కారం-రుచికి తగినంత, నిమ్మరసం-కొద్దిగా

తయారుచేసే విధానం

మొక్కజొన్నల్ని కడిగి కుక్కర్‌లో మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. బాణలిలో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చి, నిలువ్ఞగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి మగ్గాక ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్నగింజలు, ఉప్పు, కారం, గరంమసాలా వేసి కలియతిప్పాలి. గింజ లు కొద్దిగా వేగాక పొయ్యి కట్టేయాలి. మొక్కజొన్నల చాట్‌ రుచిగా ఉంటుంది. ఈ చాట్‌ని పిల్లలు ఇష్టంగా తింటారు.