ప్రారంభమైన సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌

మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు

cooperative-elections
cooperative-elections

హైదరాబాద్‌: తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. మూడు మినహా 906 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగగా, సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో 12 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 747 మంది గెజిటెడ్‌ అధికారులు పాల్గొన్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/