తక్కువ మంటమీదనే వంట చేయాలి

తక్కువ మంటమీదనే వంట చేయాలి
Cooking on low flame

వండడానికి ముందు గింజధాన్యాలను మళ్ళీ మళ్ళీ కడగకండి.
ముక్కలు చేసిన తర్వాత కూరగాయలను కడగకండి.
ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకండి.
వండిన తర్వాత మిగిలిన నీటిని పారబోయకండి.
ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి.
ఎక్కువ నూనెలో వేపుడు, కొద్దిగా వేయించే పద్ధతులు కంటే ఆహారాన్ని ప్రెజర్‌ కుక్కర్‌లో, ఆవిరిలో వండడాన్ని ఎన్నుకోండి. మొలకెత్తిన లేదా పులియబెట్టిన ఆహారం తినడాన్ని ప్రోత్సహించండి.

పప్పులు, కూరగాయలు వండడానికి సోడాను వాడకండి. వాడగా మిగిలిన నూనెను మళ్ళీమళ్లీ వేడి చేయకండి.

స్టీమింగ్‌ :
కూరలను స్టీమింగ్‌లో ఉడికిస్తే ఆరోగ్యానికి మేలు. పోషకపదార్థాలు వ్యర్థం కావ్ఞ. వేడిగా తినటానికి అనువ్ఞగా ఉంటాయి. కూరగాయలైనా, పళ్ళయినా స్టీమ్‌చేస్తే పౌష్టికత లోపించదు.

బాయిలింగ్‌:
ఉల్లిగడ్డలు, అన్నం, చికెన్‌ మాంసాలను ఉడికించాలి. కూరగాయలను స్టీమింగ్‌ చేసినట్లు చేయకూడదు. ఉడికేదాకా పొయ్యిపై ఉంచాలి. అయితే అతిగా ఉడికిస్తే విటమిన్లు కోల్పోతాయి. అందుకే తక్కువ మంటమీద ఉడికించాలి.

బేకింగ్‌:
వేయించటానికి బదులు బేకింగ్‌ పౌష్టికతను కాపాడుతుంది. తక్కువ వేడిలో వండాలి. బేకింగ్‌లో ఎక్కువ సమయం పడు తుంది. భేల్‌పూరీ లాంటి పూరీలు, మాంసం బేకింగ్‌ చేస్తే నయం. ఏ కూరలైనా వేపుడు కంటే బేకింగ్‌ మేలు. పోషకాలు పోకుండా ఉంటాయి.

సాటింగ్‌: : వేపుడుకు ప్రత్యామ్నాయం సాటింగ్‌. మంచి రుచి కూడా. నూనెలో వండాల నుకున్నప్పుడు కూరగాయలను సాటింగ్‌ చేయాలి. తక్కువ నూనె పడుతుంది. ఆలివ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

పోచింగ్‌: మాంసాన్ని నీళ్లల్లో కాని, కూరలతో ఉడికించటం చేస్తే స్టీమింగ్‌ కం టే తొందరగా ఉడుకుతుంది. మాంసానికి చేర్చటం వల్ల పౌష్టికత లోపించదు. మాంసాహారాన్ని పోచింగ్‌ విధానంలోనే ఉడికించాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/