నిమిషాల్లో వంట రెడీ!

చాలామంది అన్ని కూరలు చుట్టూ పెట్టేసుకుని కంగారు పడిపోతూ ఉంటారు. నాన్‌వెజ్ కూరలు బజారు నుంచి తెచ్చిన వెంటనే కడిగేసి ఉప్పు, కారం కలిపి ఉంచితే, ఆ కారం కూరకు బాగాపట్టి కూర రుచిగా తయారవుతుంది. అది మారినేట్ అయ్యేలోపు వండడానికి కావలసిన ఉల్లి తరుక్కోవడమో లేక మసాలా తయారుచేసుకోవడమో చేయవచ్చు. కూర ఆపూటకు ఉంటే మారినేట్ అయిన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేసి ఆఫీసుకెళ్లి వచ్చాక తీరిగ్గా వండుకోవచ్చు.
వంటచేసే సమయంలో ఏ కూర త్వరగా ఉడుకుతుందో అది ముందు వండేయాలి. ఉడకడానికి సమయం పట్టే నాన్‌వెజ్ కూరల్ని తర్వాత పొయ్యిమీద సిమ్‌లో ఉంచి పిల్లలకు టిఫిన్ సర్దడమో లేక బాటిల్స్‌లో నీళ్లు నింపటమో చేయవచ్చు.
భోజనంలోకి ఏదైనా, చట్నీలు చేయడం అవసరం. ఇడ్లీ,దోసె, వంటి అల్పాహారాలకు ఎక్కువగా చేతి పచ్చళ్లనే చేస్తుంటారు చాలామంది. ఒక గిన్నెడు చట్నీ ఏ ఆదివారమో చేసేసి ఫ్రిజ్‌లో ఉంచేస్తే రోజుకు కొంచెం తీసుకుని, తాలింపు వేసుకుంటే మనకు సమయం ఆదా అవ్వడమే గాక గ్రైండర్ కయ్యే కరెంటు ఖర్చు కలిసి వస్తుంది. పుదీనా, కొత్తిమీరవంటి వాటితో నిల్వ పచ్చళ్లు చేసుకుంటే మరీ మంచిది. రుచికి రుచి! ఆరోగ్యానికి ఆరోగ్యం! కొందరికి ప్రతిరోజూ చారు చేసుకోవడం అలవాటుంటుంది. చారు లేనిదే వాళ్లకు ముద్ద దిగదు.
అలాంటప్పుడు ఒక గిన్నెడు చారు ఉడకపెట్టి ఫ్రిజ్‌లో ఉంచేసుకుంటే రోజుకు అవసరమైనంత తాలింపు వేసుకుని ఉడికిస్తే సమయం ఎంతో ఆదా అవ్వడమే గాక గ్యాస్ ఆదా అవుతుంది. రోజూ రొట్టెలు చేయడం కొంచెం కష్టమైన పనే! ఖాళీ సమయంలో రొట్టెలు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని కావల్సి నప్పుడు తీసి మైక్రోవేవ్ ఒవెన్‌లో పెడితే అప్పుడే చేసినరొట్టెలా సాఫ్ట్ గా మారిపోతాయి.బిర్యానీ చేయడం కొంచెం కష్టమైన పనే. ఆదివారం బిర్యానీ చాలామంది చేసుకుంటారు.
అలా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వండుకుని ఫ్రీజ్‌లో పెట్టుకుని తినాలనుకున్నప్పుడు తీసి మైక్రోవేవ్ ఒవెన్‌లో పెడితే అప్పుడే తయారుచేసే బిర్యానీలా అయిపో తుంది. ఒవెన్ లేని వాళ్లు కుక్కర్ లో నీళ్ళు పెట్టి బిర్యాని గిన్నెను పెట్టి మూతపెడితే అప్పుడే తయారు చేసిన బిర్యానీలా అయి పోతుంది.ఉదయాన్నే టిఫిన్ చేయ డానికి సమయం పడుతుంది.
ఇడ్లీ చేయడమో లేక అటుకుల ఉప్మా చేయడమో, అటు కులు పాలల్లో వేసి ఇవ్వడమో, బ్రెడ్ ఆమ్లేట్ చేయడమో, బియ్యం నూకతో ఉప్మా చేయడమో లేక సాండ్విచెస్ ఇవ్వడమో లాంటివి చేస్తే త్వరగా అయిపోవడమే కాక పిల్లలకు, పెద్దలకు ఎంతో పౌష్టిక ఆహారం అవుతుంది.
పుదీనా, కొత్తిమీర అన్ని కూర ల్లో మేగ్జిమమ్ వాడతారు. అవితుంచుకుని ఫ్రిజ్‌లో వెట్టు కుంటే కూరల్లో డైరెక్ట్‌గా వేసేయవచ్చు. అలా చేయక పోతే కొత్తిమీర వేర్లు వేరుచేసి అందులో గడ్డి వేరు చేసి కడిగి వేయడానికి సమయం పడుతుంది.
తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/investigation/