కానుక

COOKING-1
COOKING

కానుక

నెయ్యి తాజాగా ఉండాలంటే దానిలో చిన్న బెల్లం ముక్క వేయాలి. కాఫీపొడి, టీ, పంచదార, పప్పులులాంటి దినుసులన్నీ ట్రాన్స్‌పరెంట్‌ డబ్బాల్లో పోసుకుని ఉంచితే కనబడుతుంటుంది. కాబట్టి తీసుకోవడం తేలిక.

తడి ఇసుకపై ఉంచిన కుండలో కూరగాయలని ఉంచితే ఫ్రిజ్‌లో ఉంచినట్లుగా అవి తాజాగా ఉంటాయి.

కలబంద రసంలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాస్తే గాయాలు త్వరగా తగ్గుతాయి.

తరచుగా ఆకుకూరలు వాడితే అజీర్ణవ్యాధి గాని, అజీర్ణ వ్యాధితో పాటు వచ్చే కడుపునొప్పి, ఉబ్బరం వంటివి రావు

వెల్లుల్లిపాయలు నాలుగు రేకలు తీసుకుని బాగా దంచి గుజ్జులాగా చేసి తీసుకోవాలి.

ఈవిధంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకుంటే వికారం తగ్గుతుంది. ్జ పసుపు, వేప ఆకుల ముద్దను స్ఫోటకం మచ్చలు వచ్చిన వారికి పూతగా పూస్తే త్వరగా తగ్గుతాయి.

స్ఫోటకానికి మరే పూత మందుగాని, ఇంగ్లీషు మందు గాని వాడటం చాలా ప్రమాదం. ్జ కళ్లమంటలు, జలుబు ఉన్నవారు పసుపు కాల్చిన వాసన చూస్తే తగ్గుతుంది. శిరోభారం, ముక్కుదిబ్బడ, ముక్కు కారడం లాంటి తగ్గడానికి పసుపు కాల్చి వాసన చూస్తే తగ్గిపోతాయి.