హైకోర్టును ఆశ్రయించనున్న సమత దోషులు

Telangana High Court
Telangana High Court

ఆదిలాబాద్‌: సమత కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు దోషులు అప్పీల్ కోసం హైకోర్టుకు వెళ్లనున్నారు. దోషులకు కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానాను శనివారం రోజున కుటుంబ సభ్యులు చెల్లించారు. రేపు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. సమత అత్యాచారం, హత్య కేసులో షేక్ బాబు, షాక్ షాబుద్దీన్, షేక్ మగ్దుమ్‌కి ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష తీర్పు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌ 24న ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయ మూర్తి విచారణ జరిపి మరణశిక్ష విధించారు.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/