సామాజిక న్యాయసాధనే రాజ్యాంగ ప్రథమ లక్ష్యం

నేడు భారత రాజ్యాంగ దినోత్సవం

Constitution Day of India
Constitution Day of India

నేడు మన దేశంలో సుమారుగా 30 శాతం జాతీయసంపద 99 శాతం మంది ప్రజలచేతుల్లో ఉండగా, 70 శాతం జాతీయ సంపద మొత్తం కేవలం ఒక శాతం మంది చేతుల్లో ఉన్నది.

దీనివలన రాజ్యాంగ లక్ష్యానికి భిన్నంగా ఆర్థిక అసమానతలు పెరుగుతాయి.

ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి, ప్రజలు స్వయం సమృద్ధిని సాధించుకొని జీవన ప్రమాణస్థాయిని మెరుగుపరుచుకొనే పరిస్థితులు కల్పించడంలో రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించవలసిన బాధ్యతగల మన ప్రభుత్వాలు విజయవంతం కాలేకపోతున్నాయి.

హక్కులు, అవకాశాలు, ప్రభుత్వ పథకాలు లాంటివి ప్రజల అనుభవంలోనికి వచ్చినప్పుడు ప్రభుత్వంతోపాటుగా అందరూ చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడే రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం ప్రజలకు దక్కుతుంది.

ఒ క దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించే అత్యుత్తమ నియమావళి కలిగిన మూలచట్టాన్నే రాజ్యాంగం అంటారు.

భారత రాజ్యాంగ నిర్మాణానికి 1946 సంవత్సరంలో ఏర్పడిన ‘భారత రాజ్యాంగ పరిషత్‌’ ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేసింది.

ప్రపంచ రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత సామాజిక పరిస్థితులను లోతుగా అర్థం చేసుకొన్న భారత రాజ్యాంగ రచనా సంఘం ఛైర్మన్‌ డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు కలిగిన రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘకాలం రచించిన,ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామిక, లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌కు అందించగా నవంబరు 26, 1949 రోజున రాజ్యాంగ పరిషత్‌ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది.

భారత ప్రభుత్వ రాజ్యాంగ నిర్మాత అయితే డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ రాజ్యాంగ రచనకు చేసిన కృషికి గౌరవార్థంగా ఆయన 125వ పుట్టిన రోజును పురస్కరించుకొని 2015 సంవత్సరంనుండి రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబరు26రోజును ‘భారత రాజ్యాంగ దినంగా ప్రకటించగా, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ రోజును మనం రాజ్యాంగ దినోత్సవంగా జరు పుకుంటున్నాం.

దీనినే మనం రాజ్యాంగ పరిరక్షణ దినం, ప్రజా స్వామ్య పరిరక్షణ దినంగా కూడా భావించాలి. అదేవిధంగా డాII బి.ఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను ఏప్రిల్‌ 13, 2016 సంవత్సరం 183 ప్రపంచ దేశాలు కలిసి ఐక్యరాజ్యసమితి లో జరుపుకోవడం జరిగింది.

సమాజంలోని అసమానతలను తరి మిటకొట్టడం,సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకుసాగటం వంటి అంబేద్కర్‌ ఆశయసాధన నేటి తరానికి ఎంతో ముఖ్యమని ఐక్య రాజ్యసమితిలో అంబేద్కర్‌ను కొనియాడారు.

1946 నవంబరు 26న మన రాజ్యాంగ పరిషత్‌లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాం.

ప్రజా భాగస్వామ్యాన్ని తెలియచేస్తూ సామాజిక న్యాయ లక్ష్యాన్ని కలిగి ఉన్నది.అందుకే భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఈ ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ వంటిది అని సంబోధించారు.

భారత రాజ్యాంగ ఔనత్యాన్ని చాటే విధంగా భారత రాజ్యాంగంపై ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్‌లోని సారనాధ్‌లో అశోక్‌చక్రవర్తి స్థాపించిన అశోక్‌ స్తంభం నుండి స్వీకరించారు.

దీనిపై ఉండే నాలుగు సింహా లు, గుర్రం,ఎద్దుతోబాటు అశోకచక్రం (సమతకు చిహ్నం) సత్య మేవ జయితే అను అక్షరాలను కలిపి 1950, జనవరి 26న జాతీయ చిహ్నంగా ఏర్పాటు చేసుకొన్నాం.

ప్రాథమిక హక్కులు:

భారత పౌరులు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కాపాడుటకు రాజ్యాంగంలోని మూడవ భాగంలో (అధికరణలు 12 నుండి 35 వరకు) గల ప్రాథమిక హక్కులైన సమానత్వపు హక్కు, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్య్రపు హక్కు, దోపిడీని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కులను పొందుపరిచిన భారత రాజ్యాంగం ఈ హక్కుల పరిరక్షణ బాధ్యతను న్యాయస్థానాలకు అప్పగించింది.

అందులో భాగంగానే ఈ రోజు మనం ప్రైవేట్‌ వ్యక్తులతోపాటు ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల నుండి ప్రాథమిక హక్కులకు భయం కలిగినా కూడా మనం న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందుతున్నాం. ఈ ప్రాథమిక హక్కుల భాగాన్ని మనం అమెరికా నుండి గ్రహించాం.

ఆదేశిక సూత్రాలు:

సంపన్నులు, పేదల మధ్య ఉన్న తారతమ్యాలను తగ్గించే రాజ్యాంగ లక్ష్యసాధనకు, ప్రజాసంక్షేమ సుస్థిర అభివృద్ధికి అనేక పథకాల ద్వారా ప్రజాసంక్షేమం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రా లను ప్రభుత్వ బాధ్యతలుగా పొందుపరిచారు.

ఈ ఆదేశిక సూత్రాల భావనను మనం ఐర్లాండు రాజ్యాంగం నుండి గ్రహించాం.

దీని ప్రకారంగా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి, ప్రజాశక్తిసామర్థ్యాలను ఉపయోగించుకొని ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచి సామాజిక న్యాయాన్ని అందించే బాధ్యత ప్రభుత్వాలదే.

రాజ్యాంగం ఎంతమంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కానట్లయితే అది చెడ్డ ఫలితాలను ఇస్తుంది అన్న ఆనాటి అంబేద్కర్‌ మాటలు నేడు మనం గుర్తుచేసుకొని రాజ్యాంగ అమలుకు కృషి చేయాలి.

జవాబుదారీతనం

భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాంఅని రాజ్యాంగ ప్రవేశికలో చెప్పిన ఉద్దేశం ఏమనగా ప్రజలచేత, ప్రజాసేవ కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ప్రజల సేవకొరకు నియమింపబడిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని తెలియచేయ డమే అవుతుంది.

ప్రభుత్వ నిర్మాణానికి, రాజ్యాధికారానికి, ప్రజాసేవకులైన ప్రభుత్వ అధికారుల నియామకాలకు మూలం, కేంద్రం, ఆధారం ప్రజలే అయినప్పుడు ఆ ప్రజలకు వాబుదారులే.

ప్రభుత్వం నుండి జీతం పుచ్చుకుంటున్న వారందరూ ఏ హోదాలో ఉన్నప్పటికీ ప్రజాసేవకులే. చేసే పనికి వారంత ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని సమాచార మాజీ కమిషనర్‌ వెల్లడించారు.

భారత సమాజంలో ప్రజలందరికీ చెందవలసిన జాతీయ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృ తమై, నిజమైన అభివృద్ధికి ఆటంకంగా మారింది.

నేడు మన దేశంలో సుమారుగా 30 శాతం జాతీయసంపద 99 శాతం మంది ప్రజలచేతుల్లో ఉండగా, 70 శాతం జాతీయ సంపద మొత్తం కేవలం ఒక శాతం మంది చేతుల్లో ఉన్నది. దీనివలన రాజ్యాంగ లక్ష్యానికి భిన్నంగా ఆర్థిక అసమానతలు పెరుగుతాయి.

ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి, ప్రజలు స్వయం సమృద్ధిని సాధించుకొని జీవన ప్రమాణస్థాయిని మెరుగుపరుచు కొనే పరిస్థితులు కల్పించడంలో రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించ వలసిన బాధ్యతగల మన ప్రభుత్వాలు విజయవంతం కాలేకపోతున్నాయి.

హక్కులు, అవకాశాలు, ప్రభుత్వ పథకాలు లాంటివి ప్రజల అనుభవంలోనికి వచ్చినప్పుడు ప్రభుత్వంతోపాటుగా అందరూ చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడే రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం ప్రజలకు దక్కుతుంది.

  • గుంటి బాలకోటేశ్వరరావు

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/