శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

srisailam dam
srisailam dam

కర్నూల్‌: ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రవాహానికి హంద్రీ వరద తోడవడంతో ప్రాజెక్టులోకి లక్షా 50 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 884.6 అడుగులు (213.4) టీఎంసీలకు చేరింది. దీంతో జలాశయం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌ జలాశయానికి 2 లక్షల 24 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.7(311.14) టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువడటంతో ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువ పులిచింతలకు వదులుతున్నారు. సాగర్‌ జలాశయం 6 గేట్లను (10 అడుగుల) మేర ఎత్తి 90 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ, జల విద్యుత్‌ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా మరో 50 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/