చంద్రబాబు పై దాడికి కుట్ర

buddha-venkanna
buddha-venkanna

అమరావతి: టిడిపి నేత బుద్ధా వెంకన్న ఈరోజు మీడియాతో మాట్లాడుతు టిడిపి అధినేత చంద్రబాబుపై దాడికి కుట్ర జరుగుతోందని ఇందుకోసం వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కారుమురి నాగేశ్వరరావు, బీఏ మధుసూదనరెడ్డిలను జగన్ రౌడీల్లా తయారు చేశారని ఆయన ఆరోపించారు. ఈ ముగ్గురు నేతలను టీడీపీ సభ్యులవైపు కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని అవమానాలకు గురిచేస్తోందని వెంకన్న మండిపడ్డారు. అధికారపక్ష సభ్యులు చంద్రబాబును ఏకవచనంతో పిలుస్తూ విమర్శలు చేస్తే, వాటిని టీవీల్లో చూపించడం లేదని ఆరోపించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టడం ద్వారా తెలుగుజాతిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో ఎంత ముందుకెళ్లిందో, జగన్ సీఎం అయ్యాక అంతే వెనక్కు వెళుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/