శివకూమార్‌ను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ

Shivakumar
Shivakumar

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్ ను నిన్న రాత్రి ఢిల్లీలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రూ. 8.59 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్ తో పాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్య, మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు. గత నాలుగు రోజులుగా శివకుమార్ ను ఈడీ అధికారులు ఢిల్లీలో విచారిస్తున్నారు. ఈరోజు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, ఈ ఉదయం శివకుమార్ అస్వస్థతకు గురయ్యారు. శివకుమార్ అరెస్ట్ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/andhra-pradesh/