అసెంబ్లీకి నల్ల కండువాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యెలు

Telangana Assembly
Telangana Assembly

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరై నిరసన తెలిపారు. మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పొడెం వీరయ్య, సీతక్క నల్ల కండువాలతో హాజరయ్యారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/