వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదం చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తతో కాళ్ళు కడిగించుకోవడం వివాదానికి దారితీసింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే పాదాలను పార్టీ కార్యకర్త ఒకరు పాదాలను కడుగుతున్నట్టు వైరల్ అయిన వీడియో వివాదాలను రేపుతోంది. పటోలే తన కారులో నుంచి దిగుతుండగా కార్యకర్త నీళ్లు తెచ్చి ఆయన పాదాలను తన చేతుల తోనే కడుగుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.

అయితే అక్కడ ఈ మధ్యనే బాగా వర్షాలు కురిశాయి. దీని కారణంగా ఆ ప్రాంతం అంతా బురద బురదగా మారింది. దీంతో తన కాళ్ళను కడుక్కునేందుకు నీళ్ళు తేవాలని కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పారు. అయితే ఆ సదరు కార్యకర్త నీళ్ళు తేవడమే కాకుండా ఏకంగా పటోలే పాదాలే వాటితో శుభ్రం చేశారు. దీన్నంతా ఎవరో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇప్పుడు ఈ వీడియో మీద బీజేపీ (BJP) మండిపడుతోంది. ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ముంబై బీజేపీ. పార్టీ కోసం కష్టపడేవారిని ఇలానేనా అవమానించేది అంటూ విమర్శిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే దీనికి సమాధానం చెప్పాలంటూ అడుగుతోంది. అకోలా జిల్లా వాడెగావ్ ప్రాంతంలో సోమవారం నానాపటోలే పర్యటిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

Congress has a Nawabi Feudal Shehzada mindset

Maharashtra Congress president Nana Patole’s gets his leg and feet washed by a party worker in Akola…

They treat Janta and workers like Ghulam & themselves like Kings & Queens

Imagine how they treat people without coming to… pic.twitter.com/dmzeSUNZxB— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) June 18, 2024