నారాయణ ఖేడ్‌, వడ్డేపల్లిలో కాంగ్రెస్‌ విజయం

congress party
congress party

సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్‌ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ 8 వార్డుల్లో, టీఆర్ఎస్ 7 వార్డుల్లో విజయం సాధించారు. అటు సదాశివపేట పురపాలకను టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 26 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవంతో టీఆర్ఎస్ 13 స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్ 9, బీజేపీ 1, ఎంఐఎం 2, స్వతంత్రులు 1 వార్డుల్లో గెలుపొందారు.
ఇంకా మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కారు జోరుకు కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేస్తోంది. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. మొత్తం 10 వార్డులకు గాను.. కాంగ్రెస్ పార్టీ 8 వార్డులను కైవసం చేసుకోగా.. టీఆర్ఎస్ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/