హైదరాబాద్ లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం

హైదరాబాద్: హైద‌రాబాద్ శివారు కొంప‌ల్లిలో కాంగ్రెస్ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయి. మండ‌ల‌,బ్లాక్, జిల్లా అధ్య‌క్షుల‌కు రాజ‌కీయ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను ఏర్పాటు చేశారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. 119నియోజ‌క వ‌ర్గాల నుంచి దాదాపు 1200మంది హాజ‌రైయ్యారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి ప్రారంభోప‌న్యాసం ఇవ్వ‌నున్నారు. పార్టీ ప‌టిష్ట‌త‌,సిద్ధాంతాలు అనే అంశాల‌పై ప్ర‌సంగించ‌నున్నారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌,పీసీసీ మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డిజిట‌ల్ మెంబ‌ర్ షిప్ పై టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌ర్క‌ర వేణుగోపాల్, దీప‌క్ జాన్ శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

ప్ర‌జాచైత‌న్య పాద‌యాత్ర‌పై ఏఐసీసీ కార్య‌క్ర‌మాల ఇంచార్జి మ‌హేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌సంగించ‌నున్నారు. ద‌ళితుల‌పై దాడులపై ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్ కుమార్ ప్ర‌సంగించ‌నున్నారు. సామాజిక న్యాయంపై మ‌ధుయాష్కీ,నైనాల గోవ‌ర్థ‌న్ ప్ర‌సంగం ఉంటుంది.స‌మకాలీన రాజ‌కీయ అంశాల‌పై ప‌లువురు సీనియ‌ర్ల ప్ర‌సంగాలు ఉంటాయి. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఏఐసీసీ ఇంచార్జి మాణిక్క‌మ్ ఠాగూర్,బోసురాజు త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/