కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటి

అధ్యక్షుడి ఎన్నిక కోసం సమావేశం

Congress' top leaders meeting
Congress’ top leaders meeting

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఈరోజు ప్రారంభమైంది. పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధ్యక్ష పదవికి సీనియర్‌ నేతలు ముకుల్‌ వాస్నిక్‌, మల్లికార్జున్‌ ఖర్గే పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. తొలుత తాత్కాలిక ప్రాతిపదికన అధ్యక్షుడిని ఎన్నుకుని, ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్ష పదవికి అంతర్గత ఎన్నికలు నిర్వహించేందుకు కొందరు సీనియర్లు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌, జ్యోతిరాదిత్య సింధియా, రణ్‌దీప్‌ సుర్జేవాలా తదితర సీనియర్‌ నేతలు హాజరయ్యారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/