ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేయవద్దు


డిమాండ్లు సాధించే వరకు పోరాడాలని సూచన

Uttam Kumar
Uttam Kumar

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయవద్దని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం దారుణమని, కార్మికుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని, అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిపో వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు పూర్తి సంఫీుభావం తెలియజేస్తున్నామని చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/