ఇప్పటం గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ నేతల బృందం

congress team is visiting the ippatam village

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటం గ్రామం గురించి మాట్లాడుకుంటున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూల్చడం ఫై గ్రామస్థులు , ప్రతిపక్షపార్టీలు అధికార పార్టీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ మీటింగ్ కు స్థలం ఇచ్చారనే కోపంతో వైస్సార్సీపీ ఈ దాడికి పాల్పడిందని జనసేన ఆరోపిస్తుంది. ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి ఇల్లు కోల్పోయిన వారికీ ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరోపక్క ఇప్పటం గ్రామంలో కాంగ్రెస్ నేతల బృందం పర్యటించింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను కాంగ్రెస్ బృందం పరామర్శించింది. అన్యాయం గా ఇళ్లు కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ… ఇప్పటం ఓ చిన్న పల్లెటూరు అని… పల్లెటూరులో 120 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్లు కుల్చారని అన్నారు. రాజకీయ కుట్రతోనే ఇళ్లు కుల్చివేశారని మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యంగా ఇళ్లు కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు నష్టం పరిహారం చెల్లించాలని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మస్తాన్ వలీ స్పష్టం చేశారు.