హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ క్యాంపైన‌ర్స్ జాబితా

20 మందితో క్యాంపయిన‌ర్ల‌ జాబితా

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరి ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలో దిగింది. ఉపఎన్నికు సంబంధించి నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేసేందుకు స‌ర్వం సిద్ధం చేసుకుంటోంది. 20 మందితో కూడిన క్యాంపెన‌ర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

ఈ జాబితాలో కాంగ్రెస్ నేత‌లు..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి, ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, దామోద‌ర రాజ‌న‌ర్సింహా, మ‌ధుయాష్కీ త‌దిత‌రులు ఈ క్యాంపైన‌ర్ల జాబితాలో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 వేల ఓట్ల సాధించి.. రెండో స్థానంలో నిలిచింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/