అల్లర్లు, హింస చేలరేగడం వెనక కాంగ్రెస్‌ హస్తం ఉంది

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై హింసాత్మక నిరసనల వెనక విపక్షాల ప్రమేయం ఉందని ప్రధాని నరేంద్ర మోడి మండిపడ్డారు. దేశంలో అల్లర్లు, నిరసనలు చేలరేగడం వెనుక కాంగ్రెస్‌, మరియు దాని మిత్రపక్షాల పాత్ర ఉందని మోడి విమర్శించారు. ఝార్ఖండ్‌లో ప్రధాని మోడి ఆదివారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ..పౌరసత్వ బిల్లుపై అనవసర రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలు హింసను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆందోళనలను చూస్తుంటే పార్లమెంట్‌లో తీసుకొచ్చిన చట్టాలన్నీ సరైనవే అన్న భావన వస్తోందని మోడి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల నేతలు వారికి ఏంకావాలో చూసుకుంటారే తప్ప దేశ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోరని ఆయన మండిపడ్డారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, ఆప్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన మైనారిటీ వర్గాలు శరణార్థులుగా బతుకీడుస్తున్నారని, వారికి గౌరవప్రదమైన స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంకా పౌరసత్వ బిల్లును పార్లమెంట్‌ ఉభయసభలూ ఆమోదించాయాని ఈ సందర్భంగా మోడి గుర్తుచేశారు.

తాజా క్రీడా వార్తల కోస క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/