20 మంది సైనికులు ఎలా అమరులయ్యారో చెప్పాలి?

కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన సోనియా గాంధీ

YouTube video
Congress President Smt. Sonia Gandhi shares a message for our armed forces

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ లడఖ్‌లో నెలకొన్న పరిస్థితిపై దేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గాల్వాన్‌ సంఘటనలో వీర మరణం పొందిన సైనికుల గౌరవార్థం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రచారంలో భాగంగా సోనియా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైనాతో ఉన్న సరిహద్దులను కాపాడే విషయంలో కేంద్రం తప్పించుకోజాలదని సోనియా గాంధీ పేర్కొన్నారు. చైనా గనక భారత భూభాగాన్ని ఆక్రమించలేదన్న మాటే నిజమైతే.. 20 మంది భారత సైనికులు ఎందుకు అమరులయ్యారో చెప్పాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని ప్రధాని మోడి ప్రకటించారని, అయితే… ఉపగ్రహ చిత్రాలను చూసిన నిపుణులు మాత్రం చైనా దళాలు చొరబడినట్లు పేర్కొన్నారని అన్నారు. లడఖ్ లో చైనా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని ఎప్పుడు, ఎలా తిరిగి తీసుకొస్తారో చెప్పాలని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/