సింధియాపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న వేణుగోపాల్

Jyotiraditya-Scindia
Jyotiraditya-Scindia

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన నిర్ణయాన్ని వెల్లడించిన కాసేపటికే ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఆయన పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పార్టీ నుంచి సింధియా బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సింధియా తన రాజీనామా లేఖను పంపిన నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉదయం ప్రధాని మోడి , కేంద్ర హోం మంత్ర అమిత్ షాలతో భేటీ అయిన వెంటనే కాంగ్రెస్ కు సింధియా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు. సింధియా నిర్ణయంతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది.

తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/