గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సిఎల్పీ బృందం

గోదావరి ముంపు ప్రాంతాల్లో సిఎల్పీ బృందం పర్యటిస్తున్నారు. జూన్ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 70 అడుగుల మేర గోదావరి నది ప్రవహించి ముంపు గ్రామాలను ముంచేసింది. దాదాపు వారం రోజుల పాటు చాల గ్రామాలూ నీటిలోనే ఉండిపోయాయి.

తాజాగా గోదావరి పరివాహక ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీలో మంగళవారం కాంగ్రెస్ శాసనసభపక్ష బృందం పర్యటిస్తోంది. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి లు భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వరద ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరారు. విస్తా కాంప్లెక్స్, చెప్టా దిగువన పరిసరాల్లో ఇటీవల ముంపునకు గురై ఆర్థికంగా ఇబ్బందుల పాలైన వ్యాపారులను పరామర్శించి. అనంతరం సుభాష్ నగర్ కాలనీలోని ముంపునకు గురైన కుటుంబాలను పరామర్శించారు. భద్రాద్రి ఏజెన్సీలో పర్యటన ముగిసిన అనంతరం ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం వెళ్ళనుంది.