కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు – VH

Congress Leader V Hanumantha Rao
Congress Leader V Hanumantha Rao

కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. మంగళవారం పీజేఆర్ తనయుడు విష్ణు ఇంట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియా తో వి హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని.. అందరూ కలిసి ఉంటేనే బలోపేతమవుతుందని హితవు పలికారు. పార్టీ నిర్ణయాన్ని మీరన్నట్టు తనపై వస్తున్న వార్తలకు ఇప్పుడే స్పందించనని, సీనియర్లతో చర్చించాకే మాట్లాడుతానని వీహెచ్ తెలిపారు.” జనార్దన్ రెడ్డి కుమారుడు పార్టీని వదిలే ప్రసక్తే లేదు. పార్టీ ఉన్నంత కాలం పార్టీతోనే విష్ణువర్ధన్రెడ్డి ఉంటారు. ఇతర పార్టీలోకి విష్ణు వెళ్తున్నారనేది దుష్ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరూ కలిసి ఉంటేనే పార్టీ నిలబడుతుంది. టిఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ఉండాలి” అని VH అన్నారు. అలాగే పార్టీలో పని చేయని వారికి టికెట్లు ఇవ్వమని హెచ్చరించారు మధు యాష్కి.

పీజేఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలవని వారుండరని.. విష్ణు తండ్రి జ్ఞాపకార్ధం కాంగ్రెస్ నేతలను పిలిచారని వెల్లడించారు. పీజేఆర్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నారు..విష్ణు ని చూసి కాంగ్రెస్ యువత ముందుకు రావాలని కోరారు. రాహుల్ గాంధీ నాయక్వత్వం లో మనం అందరం పని చేయాలి..కాంగ్రెస్ లోకి రావడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విధి విధానాలు చూసి వచ్చే వారికి ఆహ్వనం పలుకుతున్నామని.. పార్టీ ని నమ్మి పని చేసిన వారికి అన్యాయం జరగదని చెప్పారు. టికెట్ కోసమే వచ్చి పని చేసే వారికి టికెట్ లు ఉండవు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది…కొత్తగా వచ్చిన వారి గురించి అదిష్టానం చూసుకుంటుందన్నారు. ఇక్కడి నుండి వెళ్లిన వారు తిరిగి రావాలని అనుకుంటున్నారు…ప్రశ్నిస్తున్న వారిపై కాల్పులు జరుపుతున్నారు..8 సంవత్సరాలు గా పార్లమెంట్ లో ప్రధానిని ఏనాడు ప్రశ్నించని వ్యక్తి కేసీఆర్ అని ఫైర్‌ అయ్యారు.