లోక్‌సభలో అధిర్‌ రంజనే కాంగ్రెస్‌ పక్ష నేత

Adhir Ranjan Chowdhury
Adhir Ranjan Chowdhury

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత ఎవరన్న దానిపై ఎట్టకేలకు తెరపడింది. బెంగాల్‌కు చెందిన పార్టీ సీనియర్‌నేత అధిర్‌ రంజన్‌ చౌదరి లోక్‌సభలో పార్టీ నాయకుడిగా వ్యవహరించనున్నారు. గత కొన్ని రోజులుగా..ఈ పదవికి ప్రముఖంగా వినిపించిన పేర్లలో అధిర్‌ కూడా ఉన్నారు. తొలుత రాహుల్‌ గాంధీయే ఈ పదవి చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చినప్పటికీ పార్టీ అధిర్‌ రంజన్‌ చౌదరిని ఎంపిక చేసింది. మంగళవారం నాడు పలు కీలక అంశాలపై చర్చించడానికి సమావేశమైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అధిర్‌ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/