కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి అరెస్టు

Revanth Reddy arrested
Revanth Reddy arrested

హైదరాబాద్‌: మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. కెటిఆర్‌ ఫాంహౌస్‌పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఐదుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… తాజాగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కెటిఆర్‌ ఫాంహౌస్‌పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి సహా మొత్తం 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న రేవంత్ రెడ్డి, కృష్టారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సూచించారు. అయితే వీటిని రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో… ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిపై ఐపీసీ 184, 187 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు… ఆరు పేజీలతో కూడిన ఎఫ్ఐఆర్‌ను కూడా ఫైల్ చేసినట్టు సమాచారం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/