కెసిఆర్‌కు అసలు నీటి అంచనా తెలుసా?

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సిఎం కెసిఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు

Jeevan Reddy
Jeevan Reddy

కరీంనగర్‌: ప్రతిపక్షాలపై విమర్శలు తప్ప.. అసలు నీటి అంచనా తెలసా కెసిఆర్‌కు అని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యమానేరు బాధితులపై లాఠీ జులిపించడం దారుణం అని ఆయన మండిపడ్డారు. తెలంగా ఏర్పడింది కెసిఆర్‌ కోసమేనా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వేములవాడ పర్యటనలో సిఎం కెసిఆర్‌ చేసిన పలు వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 80 లక్షల ఎకరాలకు సాగుకు దాదాపు 800 టిఎంసీల నీరు కావాలని అన్నారు. అయితే కెసిఆర్‌ చెప్పినట్లు మిడ్‌ మానేరుతో 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందా? అని ఆయన ప్రశ్నించారు. అంటే కెసిఆర్‌ ఏది చెప్తే అది అందరూ వినాలా? అని ఆయన అన్నారు. రూ. 38 వేలకోట్ల ప్రాజెక్టును లక్ష కోట్లతో పూర్తి చేశారని ధ్వజమెత్తారు. కెసిఆర్‌ ఎప్పుడూ కాళేశ్వరం గురించి గొప్పలకు పోవడం తప్ప ఏమి చేయలేదని దూషించారు. అంతేకాదు ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదని కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/