సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్‌ నేతల నిరసన

sathyagraha deeksha
sathyagraha deeksha

హైదరాబాద్‌: 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సిఎల్పీని పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సిఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిపక్షణ సత్యాగ్రహం పేరుతో 36 గంటల దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, భట్టి విక్రమార్కకు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. కాంగ్రెస్‌నేతల దీక్షకు టిడిపి, టిజెఎస్‌ మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ,టిడిపి పాలిట్‌ బ్యూరో సభ్యులు తదితరులు హాజరయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/