కాంగ్రెస్‌ నేతల కీలక సమావేశం

Congress legislature meeting
Congress legislature meeting

బెంగాళూరు: బెంగళూరులోని తాజ్‌ వివంతా హోటల్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల రాజీనామాలతో జేడీఎస్‌కాంగ్రెస్‌ కూటమి బలం తగ్గిందని, ప్రభుత్వం తక్షణమే బలనిరూపణ చేసుకోవాలని లేదా సీఎం రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.
ఈ తాజా పరిస్థితులపై కాంగ్రెస్‌ పార్టీ సమావేశం అయ్యింది. సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గే తదితరులు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు జరిగే శాసనసభ సమావేశాల్లో బిజెపి తన డిమాండ్‌ను ప్రకటించనుంది.
మరోవైపు రెబల్స్‌ రాజీనామాలపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పు తర్వాత విశ్వాస పరీక్షకు సిద్ధమని కుమారస్వామి కోరితే మంగళవారం బలపరీక్ష ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/