కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

rahul, sonia, manmohan, chidambaram
rahul, sonia, manmohan, chidambaram


న్యూఢిల్లీ: ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు. ముఖ్యంగా ఐదు అంశాలపై దృష్టి సారించామని వివరించారు.

  • న్యా§్‌ు పథకం ద్వారా ఏడాదికి రూ. 72 వేలు చొప్పున పేదలకు అందిస్తాం. ఇది పేదల జేబుల్లో డబ్బు నింపుతుంది. రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్ధికపరిస్థితిని మెరుగుపరుస్తుంది.
  • 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కొత్తగా వ్యాపారం చేసే వారికి తొలి మూడు సంవత్సరాలు అనుమతులు లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 100 నుంచి 150కి పెంచుతాం.
  • రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను తీసుకొస్తాం, రైతులపై పెట్టే క్రిమినల్‌ కేసులను కేసులుగా పరిగణించం.
  • విద్యపై జిడిపిలో 6 శాతం ఖర్చు చేస్తాం.
  • జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తాం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/