టిఆర్‌ఎస్‌ లో కాంగ్రెస్‌ నేతల చేరిక

trs
trs

నల్లగొండ : నేడు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు టిఆర్‌ఎస్‌ లో చేరారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్యెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడి సమక్షంలో మునుగోడు జడ్పీటీసీ జాబులు అంజయ్య గౌడ్‌,ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్‌ యాదయ్య గౌడ్‌ టిఆర్‌ఎస్‌ లో చేరారు విరిద్దరికి మంత్రి జగదీశ్‌ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్‌ సభ ఎన్నికల సమయంలో జరిగిన ఈ పరిణామం మునుగోగు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ క్యాడర్‌ను అయోమయంలో పడేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/