సుమలత గెలుపుకు కారణాన్ని బహిరంగపరిచిన కాంగ్రెస్‌

sumlatha
sumlatha


బెంగూరు: గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మాండ్య నుంచి రెబల్‌స్టార్‌ అంబరీష్‌ సతీమణి, ప్రముఖ నటి సుమలతను పోటీ చేయించింది ఎవరు? ఆమెకు ఎవరెవరు మద్దతిచ్చారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌ – జెడిఎస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తరువాత రెండు పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు బహిరంగా విమర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుమలత పోటీకి సంబంధించిన వివరాలు కూడా బహిరంగపరిచారు. కాంగ్రెస్‌ నాయకులే సుమలతకు మద్దతుగా నిలిచి పోటీ చేయించారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు. మాజీ ప్రధానికి దేవేగౌడకు అవకాశం ఇస్తే జెడిఎస్‌ మాత్రం హీరో నిఖిల్‌కుమారస్వామికి పోటీ చేసేందుకు ఛాన్స్‌ ఇచ్చిందని వారు మండిపడుతున్నారు. మాజీ మంత్రి అంబరీష్‌ సతీమణి సుమలత మాండ్య లోక్‌సభ నుండి పోటీచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పించాలని సిద్ధరామయ్య, జి.పరమేశ్వర్‌, డికె శివకుమార్‌లను ఆమె కోరారు. అయితే సుమలతకు టిక్కెట్‌ ఇప్పించడానికి వారు అంతగా ఆసక్తి చూపించలేదు. దాంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్‌ కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వ అభ్యర్థిగా మాండ్య నుంచి పోటీ చేశారు. అయితే స్థానిక కాంగ్రెస్‌ నాయకులు నిఖిల్‌ కుమారస్వామికి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించి ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. https://www.vaartha.com/news/national/