కాల్పుల్లో కాంగ్రెస్‌ నేత మృతి

Vikas Chaudhary
Vikas Chaudhary

చండీగఢ్‌: కాంగ్రెస్‌ నేత వికాస్‌ ఛౌదరి ఫరీదాబాద్‌లో ఈరోజు ఉదయం జిమ్‌ నుండి తిరిగివస్తుండగా ఆయన పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడిన ఛౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా హత్య దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/