కెసిఆర్‌పై విజయశాంతి తీవ్ర విమర్శలు

Vijayashanti
Vijayashanti

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసి సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని, మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులపై కూడా పంజా విసరడానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వాదన వినిపిస్తోందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసిన కెసిఆర్‌ గారు ఆర్టీసీ సమ్మెను ఆసరాగా చేసుకుని తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు అన్నింటినీ కల్వకుంట్ల ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చ పోతున్నారనరే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. సచివాలయం లేకుండా ప్రగతి భవన్‌ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను చక్కపెడుతున్న సీఎం గారు..అదే వ్యవస్థను ప్రభుత్వ శాఖల్లో కూడా అమలు చేయలనుకోవడం దురదృష్టకరమని, ఆర్టీసితో మొదలైన కెసిఆర్‌ అరాచకం, రెవెన్యూ శాఖకు, మిగిలిన ప్రభుత్వ శాఖలకు కూడా విస్తరించిందని విమర్శలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/