జైలు నుండి విడుదలైన డికె శివకుమార్‌

ఢిల్లీ హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో రిలీజ్‌

D K Shivakumar
D K Shivakumar

న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డి.కె.శివకుమార్‌ నిన్నరాత్రి 9.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి విడుదలయ్యారు. శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశం విడిచి వెళ్లరాదని, రూ.25 లక్షల బాండు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు నిబంధనలు పూర్తి చేయడంతో జైలు అధికారులు శివకుమార్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన జైలు బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘ముఖ్యంగా పార్టీ అధినేత సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆమె నన్ను పరామర్శించి ధైర్యం చెప్పడం మనోస్థైర్యాన్నిచ్చింది’ అన్నారు. కాగా, శివకుమార్‌ విడుదలపై మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవగౌడ హర్షం వ్యక్తం చేశారు. శివకుమార్‌ ఈరోజు ఢిల్లీలోనే ఉండి శుక్రవారం బెంగళూరుకు చేరుకుంటారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/