కాంగ్రెస్‌ నేత కరోనా భయంతో ఆత్మహత్మ

గత వారం కరోనా బారిన పడిన గంగిరెడ్డి

Women commit sucide
man-died

కడప: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కరోనా భయంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిగిరెడ్డి గంగిరెడ్డికి గత వారం కరోనా సోకింది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా ఆయన వెళ్లిపోయారు. ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె వద్ద రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు. కరోనా భయంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/