కాంగ్రెస్‌కు భారీ షాక్..సీనియర్ నేత ఆర్‌పీఎన్ సింగ్ రాజీనామా

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందే కాంగ్రెస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆర్పీఎన్ సింగ్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వ్యవహరిస్తున్న ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్పీఎన్ సింగ్ మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. ఈమేరకు ఆర్‌పిఎన్ సింగ్ ట్వీట్ చేస్తూ, ‘ఈ రోజు మొత్తం దేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, నేను నా రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, ఆర్‌పిఎన్ సింగ్ 1996, 2002, 2007లో పద్రౌనా అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్పీఎన్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. 2004లో రెండో స్థానంలో నిలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికలలో, రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ (RPN Singh) ఎన్నికలలో విజయం సాధించారు. UPA II ప్రభుత్వ హయాంలో ఉపరితల రవాణా మరియు రోడ్డు శాఖ సహాయ మంత్రిగా, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేష్ పాండే చేతిలో 85,540 వేల ఓట్లతో ఆర్పీఎన్ సింగ్ ఓటమి పాలయ్యారు.

మరోవైపు, ఆయన ఇవాళ బీజేపీ లో చేరవచ్చని.. ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన కాషాయం కండువా కప్పుకోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/