సోనియా, ప్రియాంకలను కలిసిన నవజ్యోత్ సింగ్

పంజాబ్‌లోని ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై వివరించాను

Navjot Singh - Sonia - Priyanka
Navjot Singh – Sonia – Priyanka

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలతో పంజాజ్‌ కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్దు సమావేశమయ్యారు. కాగా పంజాబ్‌ మంత్రి పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో ఆయనకు విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఆయన వెళ్లడం చర్చనీయాంశమైంది. ‘ఢిల్లీలోని మా పార్టీ అధిష్ఠానం నన్ను పిలిచింది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో నేను సోనియా జీ, ప్రియాంక జీని కలిశాను. పంజాబ్‌లోని ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై వారికి నేను వివరించాను’ అని నవజ్యోత్‌ సింగ్‌ ఈ సందర్భంగా తెలిపారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/