60ఏళ్ల వయస్సులో కాంగ్రెస్‌ నేత పెళ్లి

ఒకప్పటి స్నేహితురాలు రవీనా ఖురానాను పెళ్లి చేసుకున్న ముకుల్ వాస్నిక్

Congress leader Mukul Wasnik gets married
Congress leader Mukul Wasnik gets married

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. తన చిరకాల స్నేహితురాలు రవీనా ఖురానాను వివాహమాడారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అతికొద్ది మంది అతిథుల మధ్య సోమవారం ఈ పెళ్లి కార్యక్రమం జరిగింది. ముకుల్‌ వాస్నిక్‌ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఈయన ఒకరు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాగా ఈపెళ్లి కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నేత, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. 60 ఏళ్ల ముకుల్ వాస్నిక్ ఇప్పటివరకు బ్రహ్మచారే. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/