కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయవద్దు

అలా అని కెసిఆరే ఒప్పుకున్నారన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కెసిఆర్‌ తెలంగాణను అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. కెసిఆర్‌ కేంద్రంలో మోడి పాట, రాష్ట్రంలో ఓవైసి పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ విఫలమైందని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయవద్దని ఆయన పేర్కొన్నారు. స్వయంగా కెసిఆరే కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయలేమని అంగీకరించారని వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తప్పకుండా గెలుస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/