ఎన్నికల కంటే ప్రజల్లోకి వెళ్లటమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం

congress-leader-jairam-ramesh-slams-trs-and-bjp

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత జైరాం రమేష్ బీజేపీ, టీఆర్‌ఎస్‌ లపై విమర్శలు గుపించారు. ఢిల్లీలో తుగ్లక్ పాలన.. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. బీజేపీ ధన రాజకీయాలను పెంచిపోషిస్తోందని ఆరోపించారు. ఆడియో కాల్ వ్యవహారంలో కోమటిరెడ్డికి నోటీసులు జారీ చేశారని.. ఆయన వివరణ తర్వాత ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయానికి అవకాశమే లేదన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమన్నారు. భారత్ జోడో యాత్ర ఎన్నికల జిమ్మిక్కు కాదన్నారు. ఎన్నికలకంటే ప్రజల్లోకి వెళ్లటమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. మూడు రోజుల విరామం అనంతరం మక్తల్ నుంచి భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. 167వ నెంబర్ రహదారిపై 27 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. గునుముకుల క్రాస్ రోడ్ వద్ద రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద రాత్రికి బస చేయనున్నారు.