ఆసుపత్రిలో చేరిన డీకే శివకమార్‌

DK Shivakumar
DK Shivakumar

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్అధిక రక్తపోటుతోపాటు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడంతోఆసుపత్రిలో చేరారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ కు బెయిలు లభించడంతో గత నెల 23న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా, అనారోగ్యానికి గురి కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/