కెసిఆర్‌కు కాంగ్రెస్‌ అంటే భయం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

Mallu Bhatti Vikramarka
Mallu Bhatti Vikramarka

హైదరాబాద్‌: నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లో దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా నిర్వహించదలచిన ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ సమస్యల కారణంగా ర్యాలీకీ అనుమతి కుదరదని పోలీసులు తమకు లేఖ రాసారని, అయితే బదులుగా ర్యాలీ ఎక్కడ నిర్వహించాలో మీరే చెప్పాలని, మీరు చెప్పిన మార్గంలొనే ర్యాలీ చేస్తామని పోలీసులకు తాము కూడా లేఖ రాశామని తెలిపారు. అయితే తమ లేఖకు పోలీసులు స్పందించలేదని అన్నారు. ర్యాలీని ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని, వాయిదా వేసే అవకాశమే లేదని ఆయన అన్నారు. మా వ్యూహాలు మాకున్నాయని తెలిపారు. ఎంఐఎం సభకు, బిజెపి కవాతుకు అనుమతిచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ ర్యాలీని అడ్డుకోవడం సరికాదని భట్టి విక్రమార్క హెచ్చరించారు. కెసిఆర్‌కు కాంగ్రెస్‌ భయం పట్టుకుందని, అందుకే తమకు అడ్డు తగులుతున్నారని అన్నారు. ప్రజల్లో కెసిఆర్‌ వైఖరిని ఎండగతామని తెలిపారు. బిజెపికి టిఆర్‌ఎస్‌, ఎంఐఎం మద్దతు గా ఉంటున్నాయని ఆయన అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/