వారితో మంతనాలు జరపడం లేదు

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడానికి మంతనాలు జరుపుతుందని వస్తున్న వార్తలో నిజాం లేదని ఆప్‌ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ అన్నారు. అయితే ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్ని కాంగ్రెస్‌ కావాలనే సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. తమతో కలిసి నడవాలన్న ఆప్‌ ప్రతిపాదనను కాంగ్రెస్‌ ఇప్పటికే తిరస్కరించిందని ఆయన గుర్తుచేశారు. పొత్తు వ్యవహారంపై ఇరు పార్టీల మధ్య ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌.. పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మోదీని గద్దెదించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/news/national/: