మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత
nandi-yellaiah

హైదరాబాద్‌: మాజీ ఎంపి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు నంది ఎల్లయ్య(85) కన్నుమూశారు. గత నెల 29వ తేదీన కరోనా లక్షణాలతో ఆయన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య పని చేశారు. సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు పార్లమెంట్‌కు ఎన్నిక కాగా, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపిగా ఎన్నికయ్యారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నిక కాగా, ఎమ్మెల్సీగా కూడా నంది ఎల్లయ్య పని చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: