ఢిల్లీ ఫలితాలు కాంగ్రెస్‌కి కరోనాలా తగిలాయి

అధిక నష్టం కాంగ్రెస్‌ పార్టీకే జరిగింది

jairam ramesh
jairam ramesh

న్యూఢిల్లీ: మైనార్టీ మతవాదంపై కాంగ్రెస్‌ పార్టీ సామరస్య ధోరణితో ఉంటుందన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి కరోనా వైరస్‌ లా తాకాయని ఆయన అభిప్రాయపడ్డారు. షషీన్‌ బాగ్‌, పౌరసత్వ చట్టం తదితర అంశాలను బిజెపి ప్రచార అస్త్రంగా చేసుకుందని, తద్వారా ఓట్లను చీల్చిందే తప్ప, ఆ పార్టీ గెలవలేకపోయిందని అధిక నష్టం జరిగింది మాత్రం కాంగ్రెస్‌ పార్టీకేనని అన్నారు. ఒక్కసారిగా కరోనా సోకితే ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టం కాంగ్రెస్‌కు జరిగిందని తెలిపారు. మెజార్టీ ప్రజల మనోభావాల పట్ల కూడా సున్నితంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఏకే ఆంటోని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముస్లిం మతవాదంపై తాము చూసీ చూడనట్టు వ్యవహరిస్తామన్న దుష్ప్రచారం సాగుతోందని జైరామ్‌ రమేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/